తెలంగాణలో కరోనా : కొత్తగా 1556 కరోనా కేసులు, 14 మరణాలు నమోదు

Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India Coronavirus, India Covid-19 Updates, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in india

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1556 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 15, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,06,436 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 2070 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 5,82,993 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.13 శాతంగా ఉంది.

ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 14 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3510 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,933 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 182, నల్గొండలో 135, ఖమ్మంలో 131, భద్రాద్రి కొత్తగూడెంలో 114, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 91, రంగారెడ్డిలో 90, కరీంనగర్ లో 88 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here