తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Minister Niranjan Reddy Inaugurated Telangana International Seed Testing Authority Today, Minister Niranjan Reddy, Telangana International Seed Testing Authority, Minister Niranjan Reddy Inaugurated Telangana International Seed Testing Authority, Minister Niranjan Reddy Inaugurated TISTA, TISTA, TISTA Latest News, TISTA Latest Updates, TISTA Live Updates, Niranjan Reddy, Agriculture Minister S Niranjan Reddy, Agriculture Minister, S Niranjan Reddy, Agriculture Minister S Niranjan Reddy Inaugurated Telangana International Seed Testing Authority Today, Agriculture Minister S Niranjan Reddy Inaugurated TISTA, Telangana, Telangana Agriculture Minister, Mango News, Mango News Telugu,

రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన “తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రం” ను శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో విత్తన పరిశోధన, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో అత్యంత కీలకమని, వ్యవసాయ అభివృద్ది, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమని చెప్పారు.

“ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ అని ఎఫ్ఎఓ ఇటీవల వెల్లడించింది. ఇది తెలంగాణకు గర్వకారణం. హైదరాబాద్ ను చూసి గర్వపడే పరిస్థితి సీఎం కేసీఆర్ కల్పించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఐటీ రంగంలో తెలంగాణ ముందుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నాం. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా రెండో స్థానానికి ఎగబాకినాము. విత్తన బాంఢాగారంగా ప్రపంచస్థాయిలో కీర్తి గడిస్తున్నాం. ఒక్కొక్క రంగం అభివృద్ది ద్వారా హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తుస్తుంది” అని అన్నారు.

“కాళేశ్వరం ద్వారా ఏటి ఏరును ఎదురెక్కించి మల్లన్న సాగర్ ను నింపిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కింది. కోటి ఎకరాలకు పైగా భూములు తెలంగాణలో సాగవుతున్నాయి. పత్తి సగటు దిగుబడిలో దేశంలో అగ్రభాగంలో ఉన్నాం. వరి దిగుబడిలో పంజాబ్ తో పోటీపడుతున్నాం. సీఎం కేసీఆర్ వ్యవసాయ, సాగు అనుకూల విధానాల మూలంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఈ నేపథ్యంలో విత్తనరంగం మీద దృష్టి సాధించడం జరుగుతుంది. ప్రపంచంలో 70, 80 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. విత్తనరంగ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలి. విత్తన దృవీకరణ, పరీక్షల ల్యాబ్ వినియోగం మరింత పెరుగుతుంది” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seven =