మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి – మంత్రి ప్రశాంత్ రెడ్డి

Minister Vemula Prashanth Reddy Orders Officials to Complete the Construction of Media Academy Building Soon,Construction of Media Academy building, Media Academy building,Media Academy building completed immediately,Minister Prashanth Reddy,Mango News,Mango News Telugu,Telangana Mla Poaching Case,Telangana Mla Poaching Case Latest News And Updates,Telangana Mla Poaching ,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates,Minister Vemula Prashanth Reddy

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని డిసెంబర్ చివరికల్లా పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డిని ఆదేశించారు. బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డిని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆయన నివాసంలో కలిసి అకాడమీ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేసి, వినతి పత్రం సమర్పించారు. ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన మీడియా సెమినార్లో, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా అకాడమీ భవనాన్ని త్వరగా పూర్తిచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ప్రారంభింప చేయిస్తామని తెలిపిన విషయాన్ని చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్, అమర వీరుల స్థూపం ప్రారంభోత్సవం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలు వచ్చే జనవరి మాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని, వాటితోపాటు నాంపల్లిలోని చాపెల్ రోడ్డులో ఉన్న మీడియా అకాడమీ భవనాన్ని కూడా ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించేలా చూడాలని చైర్మన్ అల్లం నారాయణ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, మీడియా అకాడమీ భవన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here