అక్టోబర్ 2న గాంధీ హాస్పిటల్ వద్ద మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

MInisters Harish Rao Talasani Srinivas Says CM KCR will Unveil Statue of Mahatma Gandhi at Gandhi Hospital on OCT 2, Minister Harish Rao, Minister Talasani Srinivas, CM KCR will Unveil Statue of Mahatma Gandhi, CM KCR, Gandhi Hospital, Mango News, Mango News Telugu, Unveiling Statue of Mahatma Gandhi at Gandhi Hospital, Telangana CM KCR To Unveil Gandhi Statue On Oct 2, CM KCR To Unveil Statue Of Mahatma Gandhi , KCR to Unveil Mahatma Gandhi's Statue, Mahatma Gandhi, Mahatma Gandhi Statue

అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన మహత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. బుధవారం గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేస్తున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులను, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. మంత్రుల వెంట మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, డీఎంఈ రమేష్ రెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ముందుగా ఎంజీ రోడ్ లో గల గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారని, అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్ ముందు హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని చెప్పారు.

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ అనేక దేశాలకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలిచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటి గాంధీని వదిలి గాడ్సేని కోలుస్తున్న దౌర్బాగ్యపు వ్యవస్థను చూస్తున్నామని పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రంలోని పలు థియేటర్ లలో మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజెప్పే సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని తెలిపారు. ఇక ఎంతో చరిత్ర కలిగిన గాంధీ ఆసుపత్రి వద్ద 16 అడుగుల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ అనేకమందికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ చూపిన అహింసా మార్గాన్ని అవలంభించారని చెప్పారు. సీఎం కేసీఆర్ సైతం 14 ఏళ్ళు అహింసా మార్గంలో రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి తెలంగాణను సాధించారని తెలిపారు. కోవిడ్ సమయంలో అత్యద్భుత సేవలు అందించిన ఆసుపత్రిగా గాంధీ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.

ఎంజీ రోడ్ గాంధీ విగ్రవం వద్ద పనులు పరిశీలించిన మంత్రి తలసాని:

అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్న ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =