కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రకు బ్రేక్

Komatireddy Venkat Reddy, Komatireddy Venkat Reddy Padayatra, Mango News Telugu, Nalgonda SP Denied Permission To Komatireddy, Nalgonda SP Denied Permission To Komatireddy Padayatra, Nalgonda SP Denied Permission To Komatireddy Venkat Reddy, Nalgonda SP Denied Permission To Komatireddy Venkat Reddy Padayatra, Telangana Latest News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 26 వ తేదీనుంచి తలపెట్టిన పాదయాత్రకు బ్రేక్ పడింది. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని, ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బ్రాహ్మణవెల్లెంల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తలపెట్టారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లెం నుంచి హైదరాబాద్ లోని జలసౌధ వరకు పాదయాత్రకు అనుమతుల కోసం డీజీపీ,నల్గొండ జిల్లా ఎస్పీకి కోమటిరెడ్డి దరఖాస్తు చేసుకోగా, పోలీసులు పాదయాత్రకు అనుమతిని నిరాకరించారు.

అయితే తన స్వేచ్ఛను హరిస్తూ పాదయాత్రకు అనుమతి నిరాకరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేసి తీరుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేసారు. పాదయాత్రపై చివరివరకు ఉత్కంఠ కొనసాగింది. ఆదివారం సాయంత్రం నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట ఒక లేఖను విడుదల చేసారు. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై 26, 27వ తేదీల్లో పాదయాత్రను రూపొందించడం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతారని, గణేష్ నవరాత్రుల వలన వాహనాల రద్దీ ఎక్కువుగా ఉంటుందని, గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఎస్పీ రంగనాథ్ పేర్కొన్నారు.

 

[subscribe]
[youtube_video videoid=KBsE83PIzVQ]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fifteen =