ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

AP Govt Over Polavaram Reverse Tendering, Ap Political Live Updates, Ap Political Live Updates 2019, Ap Political News, AP Political Updates, AP Political Updates 2019, High Court Shock to AP Govt, High Court Shock to AP Govt Over Polavaram, High Court Shock to AP Govt Over Polavaram Reverse Tendering, Mango News Telugu, Polavaram Project Reverse Tendering, Polavaram Reverse Tendering

పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. నవయుగ కంపెనీ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో ఇటీవలే జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పై ముందుకు వెళ్ళద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయుగ కంపెనీతో కుదిరిన కాంట్రాక్టు రద్దు చేస్తూ ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో, నవయుగ కంపెనీ ఈ నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది.

ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఆదేశాలు వచ్చేంతవరకు జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణపనులను వేరే ఇతర సంస్థలకు అప్పగించవద్దని హైకోర్టు కోరింది. కేంద్రప్రభుత్వం నుంచి రివర్స్ టెండరింగ్ పై కొంత కాలం పాటు వేచి చూడాలని సూచనలు వచ్చినా కూడ ఈ నెల 17వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులకు, జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. హైకోర్టు ఈ రోజు రివర్స్ టెండరింగ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

 

[subscribe]
[youtube_video videoid=-imosSlhn1Q]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =