విద్యుత్ రంగంలో దేశంలోనే ద్వితీయ స్థానంలో తెలంగాణ.. నీతి ఆయోగ్‌

NITI Aayog Telangana is in Second Place For Power Supply To Agriculture Industrial Sectors, Telangana scores 100 for power supply to agriculture, Telangana scores 100 for power supply to Industrial Sectors, Telangana is in Second Place For Power Supply To Agriculture, Telangana is in Second Place For Power Supply To Industrial Sectors,, NITI Aayog, Telangana is in Second Place For Power Supply, Telangana Power Supply, Power Supply, Power Supply To Industrial Sectors, Power Supply To Agriculture, Telangana Power Supply News, Telangana Power Supply Latest News, Telangana Power Supply Latest Updates, Telangana Power Supply Live Updates, Telangana scores 100 for power supply, Telangana scores Second Place for power supply, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో పలు అంశాల్లో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ అధికారిక ప్రకటనలో తెలిపారు. కాగా కేరళ మొదటి స్థానంలో నిలిచింది. కేరళ తర్వాతి స్థానంలో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. తెలంగాణ ఇంధన రంగంలో బిజెపి పాలిత రాష్ట్రాలతో సహా చాలా రాష్ట్రాలను అధిగమించింది. వాణిజ్య మరియు ప్రభుత్వ భవనాలు మరియు నియంత్రణ ఆస్తులు, రాష్ట్ర ఇంధనం మరియు వాతావరణంలో ఇంధన ఆదాతో పాటు పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలకు సరఫరా చేయబడిన విద్యుత్ గంటలలో మెరుగైన స్కోరు సాధించింది. నీతి ఆయోగ్ ఇండెక్స్ (SECI) వెల్లడించింది. నీతి ఆయోగ్ ప్రకారం, పెద్ద రాష్ట్రాలు – తమిళనాడు, మహారాష్ట్ర మరియు తెలంగాణ – ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను అనుసరించడంలో గణనీయమైన ప్రయత్నాలు చేస్తున్నాయి మరియు వాణిజ్య మరియు ప్రభుత్వ భవనాలలో ఇంధన ఆదాలో ముందున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ దీనిపై మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ 7వ స్థానంలో ఉందని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ ఇంధన వనరుల అందుబాటు, స్థోమత మరియు విశ్వసనీయతలో గుజరాత్ కంటే తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచిందని,దేశంలోనే కేరళ తర్వాతి స్థానంలో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తను సరఫరా చేయడంతో పాటు ఎలాంటి కరెంటు కోతలు లేకపోవడంతో తెలంగాణ విశ్వసనీయతలో కూడా మంచి స్థానం సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపు వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు, పారిశ్రామికవేత్తలు కూడా 24 గంటల పాటు విద్యుత్ సరఫరాతో ప్రయోజనం పొందుతున్నారని వినోద్ కుమార్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =