నిమ్స్ లో ఆందోళన చేపట్టిన నర్సులు

Mango News Telugu, NIMS Nurses Protesting Against Injustice, NIMS Nurses Protesting Against Injustice Over Promotions, Nurses Boycott Duties At NIMS, Nurses Boycott Duties At NIMS And Protesting Against Injustice Over Promotions, Political Updates 2019, Protesting Against Injustice Over Promotions, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి లేదని, నిమ్స్ ఆసుపత్రిలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ చాంబర్‌ వద్ద స్టాఫ్‌నర్సు నిర్మల గురువారం నాడు బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మల ఆత్మహత్యాయత్నానికి నిరసనగా నిమ్స్‌లో నర్సులు ఈ రోజు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆందోళనను దిగారు. పదోన్నతుల కల్పించే విషయంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన్ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పదోన్నతులలో అర్హులను పక్కనబెడుతున్నారని, ఈ విషయంపై ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలన్నారు. ప్రస్తుతం ఆర్‌ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న స్టాఫ్‌నర్సు నిర్మలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు నిమ్స్ డైరెక్టర్ కే.మనోహర్ ను కలుసుకుని తమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా నర్సులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నర్సుల సమస్యలు పరిష్కారానికి మనోహర్‌ భరోసా ఇచ్చారు, స్టాఫ్‌నర్సు నిర్మల పదోన్నతి అంశం కోర్టు పరిధిలో ఉందని, ఆమె విషయంలో కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 3 =