ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు

Paddy Procurement Issue TRS Leaders and Activists hoisted Black Flags at their Houses, TRS Leaders and Activists hoisted Black Flags at their Houses, TRS Leaders hoisted Black Flags at their Houses, TRS Party Leaders and Activists hoists black flags across Telangana, black flags across Telangana, TRS Party Leaders and Activists Black Flag Protest over Paddy Procurement Issue, TRS Party Protest, TRS Party Protest Against Paddy Procurement Issue, TRS Party Protest Latest News, TRS Party Protest Latest Updates, TRS Party Protest Live Updates, Telangana Paddy Procurement Issue, Paddy Procurement in Telangana, Telangana Paddy Procurement, Paddy Procurement, Paddy Procurement Latest News, Paddy Procurement Latest Updates, Paddy Procurement Live Updates, Telangana CM KCR, CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై కేంద్రంపై పోరులో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు వరుసగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా ఏప్రిల్‌ 8, శుక్రవారం నాడు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతో పాటుగా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుల తమ ఇండ్లపై నల్లా జెండా ఎగురవేసి నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో తమ తమ ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ వారి ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేస్తున్నారు. తెలంగాణ‌లో యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనాలని డిమాండ్​ చేస్తున్నారు.

మరోవైపు కేంద్రంపై చేస్తున్న పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 11వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఢిల్లీలో పెద్దస్థాయిలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్‌ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు మేయర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 17 =