అన్ని పార్టీల సభల్లోనూ జనమే

People In All Party Meetings,Political Parties Public Meetings,Telangana Political Parties Public Meetings, Telangana Political Meetings, Mango News, Mango News Telugu, Political Party Meetings 2023,Cm Kcr News And Live Updates, Telangna Congress Party, Telangna Bjp Party, Ysrtp,Trs Party, Brs Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Genaral Assembly Elections

బీఆర్‌ఎస్‌ సభ హౌస్‌ఫుల్‌.. కాంగ్రెస్‌ సభ హౌస్‌ఫుల్‌.. బీజేపీ సభ హౌస్‌ ఫుల్‌.. బీఎస్‌పీ సభ కూడా హౌస్‌ఫుల్‌ అవుతోంది. ఏ పార్టీ సభ పెట్టినా జనాలు తరలివచ్చేస్తున్నారు. కాదు.. నాయకులు తరలిస్తున్నారు. ఏదేమైనా.. సభ ప్రాంగణాలు కిక్కిరిసిపోతున్నాయి. రోడ్‌ షోలు అదరగొడుతున్నాయి. ఇది రాజకీయ పార్టీలను సైతం అయోమయానికి గురిచేస్తోంది. ఆయా పార్టీల్లో, ఆ పార్టీ నేతలను మాత్రం ఎక్కడో తెలియని అనుమానం వేధిస్తోంది. సభకు వచ్చిన జనమంతా తమ పార్టీ వారేనా? వారంతా తమ ఓటర్లుగా మారుతారా? అన్నదే ఆ అనుమానం.

జనాన్ని చూసి మోసపోకుండా.. తమ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు ఎంత మంది? పార్టీ సమావేశాలకు హాజరవుతున్నవారు ఎంత మంది? వారిలో తమకు ఓటు వేసేవారు ఎంతమంది? అన్నదానిపై ఆయా పార్టీల నేతలు దృష్టి సారిస్తున్నారు. ఓటరు నాడి ఏంటన్నది అంతుచిక్కడం లేదని చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీతోపాటు ఎన్నికలకు దాదాపు 90 రోజుల ముందే బరిలోకి దిగిన అధికార బీఆర్‌ఎస్‌ సైతం ఇదే డైలమాలో ఉండడం గమనార్హం.

ఎన్నికల్లో గెలుపోటములు, జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే అంశాలను సేకరించే సర్వే సంస్థలకు సైతం ఓటరు తీరు అర్థం కావడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు.. పలు సర్వే సంస్థలు ఇటీవల విడుదల చేసిన సర్వే రిపోర్టులే నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయానికి ఓటర్లు ఏం చేస్తారోనని రాజకీయ పార్టీల్లో ఆందోళన మొదలైంది. వాస్తవానికి ప్రతి రాజకీయ పార్టీ తమ సభకు జన సమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండడం వల్లే కింది స్థాయి శ్రేణులు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నారు. అందులో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులతోపాటు సాధారణ జనం కూడా ఉంటున్నారు. దీంతో సభలకు, సమావేశాలకు జనం ఎలా వచ్చినా.. ఓటు మాత్రం తమకే పడేలా క్షేత్రస్థాయులో పరిస్థితులను చక్కబెట్టుకోవాలని పార్టీలన్నీ నిర్ణయానికొచ్చినట్టు సమాచారం.

మరో పది రోజుల్లో పోలింగ్‌ జరగనుండడంతో అన్ని పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించాయి. ఇందుకోసం బూత్‌ స్థాయి నుంచి ఓటర్లను పర్యవేక్షించేలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాయి. కొత్తగా నమోదైన ఓటర్లను కూడా కలిసేందుకు, జాబితాను సిద్ధం చేసుకున్నాయి. వీటితోపాటు గ్రామాల్లోనూ పార్టీల వారీగా లీడర్లు, కేడర్‌తో కలిపి ఒక వాట్సాప్‌ గ్రూపు, కేడర్‌, ఓటర్‌తో కలిపి మరో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 3 =