కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది – ప్రధాని మోదీతో సభలో సీఎం జగన్

AP CM YS Jagan Participates and Addresses in Vizag Public Meeting Along with PM Modi, AP CM YS Jagan Participates and Addresses in Vizag Public Meeting, AP CM YS Jagan Addresses in Vizag Public Meeting, PM Modi in Vizag Public Meeting, AP CM YS Jagan Mohan Reddy, PM Narendra Modi Two-Day Visit, PM Narendra Modi Participates in Huge Road Show at Visakhapatnam, Huge Road Show at Visakhapatnam, PM Modi at Vizag, PM Modi Vizag Tour, PM Modi Vizag Visit, PM Modi in Visakhapatnam, Prime Minister Narendra Modi, Narendra Modi, PM Narendra Modi in Visakhapatnam, PM Modi Vizag Tour News, PM Modi Vizag Tour Latest News And Updates, PM Modi Vizag Tour Live Updates, Mango News, Mango News Telugu

కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం విశాఖపట్నం ఏయూలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేబినెట్ మంత్రులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. భారతదేశ ప్రగతి రథ సారథి ప్రధాని మోదీకి హృదయపూర్వక స్వాగతం అని పేర్కొన్నారు. ఉత్తారంధ్ర గడ్డకు ప్రధాని రావడం ఇక్కడి ప్రజలకు సంతోషం కలిగిస్తోందని, కార్తీక పౌర్ణమి రోజున ఎగసిపడే సముద్ర కెరటాలకు మించిన సంద్రం వలే ప్రజలు తరలి వచ్చారని అన్నారు. ఏపీలో ఈరోజు రూ. 15వేల కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలని సీఎం జగన్ అన్నారు.

ఏపీ అభివృద్ధి, శ్రేయస్సు కోసం విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై తమ విజ్ఞప్తులను పరిశీలించాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి కేంద్రం సహాయసహకారాలు అవసరమని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమకు మరో ఎజెండా లేదని సీఎం జగన్ స్ఫష్టం చేశారు. కేంద్రం అందించే ప్రతి రూపాయి, ప్రతి సంస్థ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, దీనిని సహృదయులైన ప్రధాని గుర్తించి సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆత్మ విశ్వాసంతో జీవించేలా పాలన కొనసాగిస్తున్నామని, అలాగే తమకు కేంద్ర ప్రభుత్వం కూడా అండగా నిలిచి ముందుకు నడిపించాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 1 =