కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ ను పరిశీలించిన పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌

Punjab CM Bhagwant Singh Mann Visits Kondapochamma Sagar Reservoir Today,Kondapochamma Sagar Reservoir Wikipedia,Kondapochamma Sagar Reservoir Timings,Kondapochamma Sagar Reservoir Distance,Mango News,Mango News Telugu,Kondapochamma Reservoir Which District,Kondapochamma Sagar Reservoir Paragliding,Kondapochamma Reservoir Open Today,Places Near Kondapochamma Reservoir,Kondapochamma Reservoir Capacity,Kondapochamma Reservoir Latest News,Kondapochamma Sagar Reservoir Photos,Kondapochamma Sagar Reservoir Distance From Hyderabad,Kondapochamma Sagar Reservoir Reviews,Kondapochamma Sagar Reservoir Markook Telangana,Kondapochamma Sagar Reservoir Capacity,Kondapochamma Sagar Reservoir Weather,Tourist Spot Kondapochamma Sagar Reservoir

పంజాబ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ గురువారం సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్స్/జలాశయాలు, పలు చెక్ డ్యామ్‌ లు పరిశీలించనున్నారు. ముందుగా గురువారం ఉదయం సీఎం భగవంత్ మాన్ కొండపొచమ్మ సాగర్ రిజర్వార్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణం, టీఎంసీల సామర్థ్యం, ఆయకట్టు వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్‌ పంప్‌ హౌస్‌ను, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్, గజ్వేల్‌ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌ డ్యామ్‌లను పరిశీలించనున్నారు. ఇక ఈ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం సీఎం భగవంత్‌ మాన్‌ హైదరాబాద్‌ కు చేరుకున్నారు.

ఈ పర్యటనపై సీఎం భగవంత్‌ మాన్‌ ట్వీట్ చేస్తూ, “పంజాబ్‌లోని నీటిని కాపాడేందుకు నిమగ్నమై, కొత్త టెక్నాలజీ గురించిన సమాచారం తెలుసుకునేందుకు పంజాబ్ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఈరోజు నేను తెలంగాణ వద్ద డ్యామ్‌ను పరిశీలించేందుకు వచ్చాం. అక్కడ భూగర్భ జలాలను ఆదా చేసే సాంకేతికత గురించి సమాచారాన్ని పొందుతాము. తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జలాలను కాపాడేందుకు గ్రామాల్లో చిన్న డ్యామ్‌లు నిర్మించింది. దాని వల్ల ఇక్కడ భూగర్భ జలాలు 2 మీటర్లకు చేరాయి” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 17 =