ఎమ్మెల్యేగా రఘునందన్‌ రావు ప్రమాణస్వీకారం

BJP Raghunandan Rao Takes Oath As Dubbaka MLA, Dubbaka MLA, Dubbaka MLA Raghunandan Rao, Dubbaka MLA Raghunandan Rao Oath Taking, Mango News Telugu, Raghunandan Rao, Raghunandan Rao Press Meet, Raghunandan Rao Takes Oath, Raghunandan Rao Takes Oath as Dubbaka MLA, Raghunandan Rao Takes Oath As MLA, Telangana Assembly

మెదక్ జిలాల్లోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎం.రఘునందన్‌ రావు 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌ రావు బుధవారం నాడు ప్రమాణం స్వీకారం చేశారు. శాసన సభ స్పీకర్ చైర్మన్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రఘునందన్‌ రావు చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటుగా పలువురు బీజేపీ పార్టీ నాయకులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో పోస్టల్ ఓట్లతో కలిపి 164669 ఓట్లు పోల్ అవగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 63352 ఓట్లు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62273 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 22196 ఓట్లు లభించాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here