హైదరాబాద్ అన్ని సంస్కృతులను స్వాగతిస్తుంది.. ద్వేషం, హింసకు ఇక్కడ చోటు లేదు – మంత్రి కేటీఆర్

Telangana IT Minister KTR Inaugurates CITCO's Center of Excellence New Unit at Knowledge City in Hyderabad,Telangana IT Minister KTR Inaugurates CITCOs Center,CITCOs Center of Excellence,New Unit at Knowledge City in Hyderabad,Mango News,Mango News Telugu,Telangana IT Minister KTR Latest News,Telangana CITCO Latest News and Updates,KTR Inaugurates CITCO Company At Knowledge City,KTR Entry At CITCO Company Inauguration,Minister KTR Live,CITCO opens new unit in Hyderabad,Citco opens new permanent Center,Telangana Latest News and Updates

హైదరాబాద్ అన్ని సంస్కృతులను స్వాగతిస్తుందని, ద్వేషం, హింస వంటి వాటికి ఇక్కడ చోటు లేదని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని నాలెడ్జ్ సిటీలో గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్‌కో కొత్త యూనిట్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఫండ్ సర్వీసెస్ హెడ్ జే పెల్లర్, సిట్కో ఫండ్ సర్వీసెస్ (అమెరికా), ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు అల్ బౌర్, సిట్కో గ్రూప్ సర్వీసెస్ (ఇండియా) హైదరాబాద్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ అమిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ తొలినుంచి విభిన్న నాగరికతలను తనలో ఇముడ్చుకుందని, ఈ క్రమంలో ప్రస్తుతం విశ్వనగరంగా రూపొందిందని తెలిపారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటుందని, ముఖ్యంగా ఎడ్యుకేషన్, అకడమిక్, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయ‌ని, గత తొమ్మిదేళ్లలో సాంకేతిక రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.25 లక్షల నుండి 10 లక్షలకు పెరిగిందని వివరించారు. ఇమేజ్ టవర్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా వంటి ఇన్నోవేటివ్స్ కోసం ఇక్కడ ఒక కేంద్రం నిర్మించబడుతోంద‌ని, మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉందని, తద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా నిలవనుందని వెల్లడించారు. హైదరాబాద్‌ ఇప్పటికే అమెజాన్ యొక్క అతిపెద్ద క్యాంపస్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్, ఉబెర్, మైక్రోన్, క్వాల్‌కామ్ వంటి సంస్థల రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు నిలయంగా మారింద‌ని, ఈ క్రమంలో సిట్‌కోకు చెందిన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఏర్పాటవ్వాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

కాగా అంతర్జాతీయ క్లయింట్ బేస్ కోసం ఫండ్ మరియు బ్యాంకింగ్ సేవలకు సంబంధించి సిట్‌కో అనేక రకాల మద్దతును అందిస్తుంది. గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ పరిశ్రమకు అసెట్ సర్వీసింగ్ సొల్యూషన్‌లను అందించడంలో సిట్‌కో ముందుంది. అలాగే ట్రెజరీ మరియు లోన్ హ్యాండ్లింగ్, రోజువారీ లెక్కలు మరియు పెట్టుబడిదారుల సేవలు, కార్పొరేట్ సేవలు, రెగ్యులేటరీ మరియు రిస్క్ రిపోర్టింగ్‌తో సహా మిడిల్ ఆఫీస్ మరియు బ్యాక్ ఆఫీస్ సేవల పూర్తి సూట్‌ను అందిస్తోంది. ఇంకా బ్యాంకింగ్ పరిష్కారాలు, మరియు పన్ను మరియు ఆర్థిక రిపోర్టింగ్ సేవలు వంటివాటిలో సాంకేతిక సహకారం ఇస్తుంది. గత నాలుగు దశాబ్దాలుగా 36 దేశాలలో పరిపాలన మరియు కార్యకలాపాల కింద 1.8 ట్రిలియన్ డాలర్ల పైగా ఆస్తులతో అసెట్ సర్వీసింగ్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీలో భారీగా పెట్టుబడి పెడుతూ, సిట్‌కో భవిష్యత్తులో అసెట్-సర్వీసింగ్ ఇండస్ట్రీకి ఫ్లాగ్ బేరర్‌గా కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fourteen =