సికింద్రాబాద్‌‌ ఆర్మీ అధికారుల కీలక ప్రకటన.. తెలంగాణలో నేటినుంచి ‘అగ్నిపథ్’ ధరఖాస్తుల స్వీకరణ

Telangana Secunderabad Army Invites Applications For Agnipath Scheme Starts From Today in Online, Applications For Agnipath Scheme Starts From Today in Online, Telangana Secunderabad Army Invites Applications For Agnipath Scheme, Applications For Agnipath Scheme, Telangana Secunderabad Army, Secunderabad Army, Recruitment Under Agnipath Scheme, Agnipath Protests Live Updates, Agnipath Issue, Agnipath Protests, Agnipath protest, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Telangana Secunderabad Army News, Telangana Secunderabad Army Latest News, Telangana Secunderabad Army Latest Updates, Telangana Secunderabad Army Live Updates, Mango News, Mango News Telugu,

సికింద్రాబాద్‌‌ ఆర్మీ అధికారుల కీలక ప్రకటన చేశారు. నేటినుంచి తెలంగాణలో ‘అగ్నిపథ్‘ ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అయితే www.joinindianarmy.nic.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే ధరఖాస్తులను స్వీకరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సైన్యంలోకి ‘అగ్నివీర్’ అభ్యర్థులను చేర్చుకోవడానికి భారత సైన్యం అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 31 వరకు సూర్యాపేట లోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో ‘అగ్నిపథ్’ పథకం కింద రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోందని తెలియజేశారు.

అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్ వంటి విభాగాల్లో 10వ తరగతి ఉత్తీర్ణత మరియు అగ్నివీర్ ట్రేడ్స్‌మాన్ విభాగంలో 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని అభ్యర్థులకు సూచించారు. ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక అక్టోబర్ 1, 2022 నాటికి 23 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ప్రకటనలో పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్, ఫెయిర్ మరియు పారదర్శకంగా ఉంటుందని, మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రక్రియ పూర్తిగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ పరిధిలో జరుగుతుందని, ఇందులో ఎలాంటి మధ్యవర్తుల పాత్ర కానీ, దళారుల ప్రమేయం కానీ ఉండదని ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here