ప్రధాని మోదీ అధ్యక్షతన ఆగస్టు 7న నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

PM Modi to Chair 7th Governing Council Meeting of NITI Aayog on August 7th, Modi to Chair 7th Governing Council Meeting of NITI Aayog on August 7th, 7th Governing Council Meeting of NITI Aayog on August 7th, 7th Governing Council Meeting of NITI Aayog, NITI Aayog 7th Governing Council Meeting, 7th Governing Council Meeting, NITI Aayog Governing Council meeting on August 7, NITI Aayog Governing Council meeting News, NITI Aayog Governing Council meeting Latest News, NITI Aayog Governing Council meeting Latest Updates, NITI Aayog Governing Council meeting Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఆగస్టు 7, ఆదివారం నాడు జరగనున్న నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానం-పాఠశాల విద్య అమలు, జాతీయ విద్యా విధానం-ఉన్నత విద్య అమలు, వ్యవసాయ సంఘాలలో స్వయం సమృద్ధిని సాధించడం, పంటల వైవిధ్యం, నూనెగింజలు మరియు పప్పుధాన్యాలు, పట్టణ పాలన సహా పలు అంశాలను ఎజెండాగా పెట్టుకుని చర్చించనున్నారు. భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని జరుపుకుంటున్న సందర్భంగా స్థిరమైన, సుస్థిరమైన మరియు సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించే దిశగా నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించబడుతుందన్నారు. అలాగే కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారం యొక్క కొత్త శకం వైపు సమన్వయానికి ఈ సమావేశం మార్గం సుగమం చేస్తుందని నీతి ఆయోగ్ వెల్లడించింది.

ఈ సమావేశానికి సన్నాహాల్లో భాగంగా, జూన్ 2022లో ధర్మశాలలో జరిగిన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం, ఆరు నెలల పాటు కేంద్రం మరియు రాష్ట్రాల కఠోర కసరత్తుకు నిదర్శమని చెప్పారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ అధ్యక్షత వహించారని, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులతో పాల్గొన్నారన్నారు. నీతి ఆయోగ్ ఏడవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం పైనపేర్కొన్న ప్రతి థీమ్‌పై రోడ్‌మ్యాప్ మరియు ఫలితాల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.

జూలై 2019 తర్వాత గవర్నింగ్ కౌన్సిల్‌ లో ఇది మొదటి వ్యక్తిగత సమావేశమని చెప్పారు. గవర్నింగ్ కౌన్సిల్ ఇంటర్-సెక్టోరల్, ఇంటర్-డిపార్ట్‌మెంటల్ మరియు ఫెడరల్ సమస్యలను చర్చించడానికి ఒక వేదికను అందజేస్తుంది. ఇందులో ప్రధాని మోదీతో పాటుగా అన్ని రాష్ట్రాలు మరియు శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, నీతి ఆయోగ్ ఫుల్ టైం సభ్యులతో పాటుగా కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =