ఏడాది తర్వాత గాంధీభవన్‌కు వచ్చిన టీ-కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ

T-Congress Senior Leader MP Komatireddy Enters Gandhi Bhavan After One Year Meets TPCC Chief Revanth Reddy,T-Congress Senior Leader, MP Komatireddy Enters Gandhi Bhavan After One Year, Meets TPCC Chief Revanth Reddy,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాదాపు ఏడాది తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్‌ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక సమావేశంలో భాగంగా పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి అవన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తానని రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత ప్రకటించడం విశేషం.

ఇక రేవంత్‌తో భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గాంధీభవన్‌లో అడుగు పెట్టనని తాను ఎప్పుడూ చెప్పలేదని, గాంధీభవన్‌తో తనకు 30 ఏళ్లుగా అనుబంధం ఉందని అన్నారు. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నిర్ణీత సమయంలో ఎన్నికలకు వెళతారని, ఈలోపు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సీనియర్‌ నేతలను కోరానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సోనియాగాంధీకి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఎన్నికలకు ముందు పార్టీ 50 నుండి 60 మంది అభ్యర్థులను ప్రకటించాలని రాష్ట్ర నాయకత్వానికి సూచించానని, తద్వారా వారు క్యాడర్‌తో కలవడానికి మరియు గ్రౌండ్ లెవెల్లో పనిచేయడానికి తగినంత సమయం ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో 26వ తేదీ నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని, రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలి అనే అంశంపై చర్చిస్తామని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =