తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆర్‌అండ్‌బీలో గృహనిర్మాణ శాఖ విలీనం

Telangana Govt Merges Housing Dept into Transport Roads and Buildings Department,Telangana Govt Merges,Housing Dept into Transport,Roads and Buildings Department,Mango News,Mango News Telugu,Telangana Govt,Telangana Govt Latest News and Updates,Telangana Govt News and Updates,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గృహనిర్మాణ శాఖ‌ను రోడ్లు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. బలహీన వర్గాల హౌసింగ్ కార్యక్రమాన్ని ఇతర శాఖలు అమలు చేస్తుండడం, గృహనిర్మాణ శాఖ‌లో కొత్త పథకాలేమీ చేపట్టకపోవడం మరియు శాఖ‌ల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ శాఖకు చెందిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది, మునుపటి పథకాలు, సంబంధిత బాధ్యతలను ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగిస్తునట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గృహనిర్మాణ శాఖకు చెందిన విలీన వ్యవహారాల పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ శాఖలో తాత్కాలికంగా ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − one =