టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియామకం

Renowned Spiritual Speaker Scholar Chaganti Koteswara Rao Appointed as Advisor for TTD Dharmic Programmes,Renowned Spiritual Speaker, Scholar Chaganti Koteswara Rao, Appointed as Advisor,TTD Dharmic Programmes,Mango News,Mango News Telugu,Tirumala,Tirupati,Tirumala Tirupathi Devasthanam,TTD Latest News And Live Updates,December Quota TTD, TTD,Chaganti Koteswara Rao Pravachanalu,Chaganti Koteswara Rao Pravachanalu Latest Videos

టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్త, పండితుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ) కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు జరిగాయి. అనంతరం టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డితో కలిసి వైవీ సుబ్బారెడ్డి ఆయా సమావేశాలలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం టీటీడీ మూడు సంవత్సరాల నుండి వివిధ పారాయణాలు నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా టీటీడీ ధార్మిక సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేరును కమిటీ సూచించిందని తెలిపారు.

ఇక గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నామని చెప్పారు. గ్రామస్తులకు భజన, కోలాటం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు. మానవాళి శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ యాగాలు, హోమాలు నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ ఉన్నందున ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం, దేశం నలుమూలలతో పాటు విదేశాల నుండి తిరుమలకు వాహనాల్లో, నడక మార్గాల ద్వారా విచ్చేస్తున్న భక్తుల యాత్రానుభవాలను ఎస్వీబీసీలో ప్రసారం చేయడం, యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి, “అదివో అల్లదివో” వంటి కార్యక్రమాలు కన్నడ, హిందీ ఛానళ్లలో ప్రసారం చేయడం సహా ఎస్వీబీసీ తెలుగు, తమిళ ఛానళ్ల తరహాలో కన్నడ, హిందీ ఛానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేకమైన భక్తి కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక టీటీడీ అందిస్తున్న ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను సాధారణ ప్రజలకు తెలిసేలా స్విమ్స్, బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి కార్యకలాపాలను ప్రసారం చేయాలని, అలాగే పలు వ్యాధులకు సంబంధించిన వైద్య సలహాలను నిపుణులైన డాక్టర్లతో ఇప్పించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here