తక్షణమే పీఆర్సీ ఏర్పాటు చేయాలి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

Telangana BJP Chief Bandi Sanjay Writes to CM KCR over Set up of Pay Revision Commission,Telangana BJP Chief Bandi Sanjay,Bandi Sanjay Writes to CM KCR,Set up of Pay Revision Commission,Pay Revision Commission,Mango News,Mango News Telugu,Pay Revision Commission Ap,Pay Revision Commission Telangana 2021,8Th Pay Commission,11Th Pay Revision Commission Andhra Pradesh,Pay Revision Commission For Central Government Employees,1St Pay Commission Pay Scales,Cpse Pay Revision 2017,2Nd Pay Commission Pay Scales Chart,Pay Commission Of India,Pay Revision Commission Andhra Pradesh,Pay Revision Commission Kerala,Pay Revision Commission Meaning In Telugu,Pay Revision Commission Telangana,Pay Revision Commission Report Kerala,Pay Revision Commission Karnataka,11Th Pay Revision Commission Kerala,11Th Pay Revision Commission Report,11 Pay Revision Commission Telangana,11 Pay Revision Commission Telangana Report,Central Pay Revision Commission,10Th Pay Revision Commission Of Andhra Pradesh,11 Pay Revision Commission Andhra Pradesh,7Th Pay Revision Commission

తక్షణమే వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 1, 2023 నుండి పెరిగిన జీతాలు చెల్లించాలని, వారి కనీస హక్కులను పరిరక్షించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

ఈ ఏడాది జూన్ 30 నాటితో మొదటి పీఆర్సీ గడువు ముగియబోతోందని, ఈ ఏడాది జూలై 1, 2023 నుండి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలని, కానీ ఇప్పటి వరుకు కనీసం పీఆర్సీ కమిషన్ ను నియమించకపోవడం అన్యాయమని బండి సంజయ్ అన్నారు. ఇది ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే అవుతుందన్నారు. పే రివిజన్ కమిషన్ నివేదిక లేకుండా పీఆర్సీని ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలకు దృష్టిలో ఉంచుకుని తక్షణమే కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అలాగే దీంతో పాటు 3 నెలల గడువు విధించి, నివేదిక తెప్పించుకుని ఈ ఏడాది జూలై నుండి కొత్త పీఆర్సీని అమలు చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =