ఉద్యోగులకు శుభవార్త, పీఆర్సీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం

9.21 lakh Telangana government employees to get benefits, Cabinet approves PRC, Cabinet approves PRC recommends 30 per cent pay hike, Contract Employees, Contract Employees and Pensioners, Enhanced PRC wages for Telangana govt staff, Good news for Govt. employees, KCR announces 30% salary hike, Mango News, Nod to 30% Salary Hike, Telangana Cabinet Approved 30 percent PRC, Telangana Cabinet Approved 30 percent PRC to Govt, Telangana PRC News

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లుతో కలిపి మొత్తం 9,21,037 మందికి 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 1.4.2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 1.4.2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.

ఇక పెన్షనర్లకు 1.4.2020 నుంచి 31.5.2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here