24 గంట‌ల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా కేవలం తెలంగాణలోనే ఉన్నాయి : మంత్రి కేటీఆర్

Inauguration of Rythu Vedika building in Baddenapally, KTR, KTR Inaugurates Rythu Vedika Cluster, KTR Inaugurates Rythu Vedika Cluster at Sircilla, KTR Inaugurates Rythu Vedika Cluster at Sircilla District, KTR Inaugurates Sircilla District Rythu Vedika, Mango News, Minister KTR, Minister KTR inaugurated Rythu Vedika, Minister KTR inaugurated Rythu Vedika building, Minister KTR Inaugurates Rythu Vedika Cluster at Sircilla District, Minister KTR Inaugurates Rythu Vedika In Sircilla, Rythu Vedika Cluster, Rythu Vedika Cluster at Sircilla District, Rythu Vedika In Sircilla, Sircilla

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ గురువారం నాడు తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బద్దెనపల్లిలో రైతు వేదిక క్లస్టర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రవ్యాప్తంగా 2,603 రైతు వేదిక‌ల‌ను నిర్మిస్తున్నామని కేటీఆర్ అన్నారు. రైతుల‌ను సంఘ‌టితం చేసి, తద్వారా వచ్చే శక్తిని భారతదేశమంతా చూపెట్టుకునేందుకు రైతువేదికలు దోహదపడతాయన్నారు.

వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులు అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదన్నారు. అలాగే 5 వేల ఎక‌రాల‌కు ఒక చోట ఒక క్ల‌స్ట‌ర్ ఏర్పాటు చేసి, ఆ క్లస్టర్ లో వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారుల‌ను కూడా నియ‌మించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటివి దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఎక్కడా లేవని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 15 =