ఖమ్మంలో రెండో విడుత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ సహా పలువురు జాతీయ నేతలు

Telangana Chief Minister KCR Along with Other CMs Launches The Second Phase of Kanti Velugu in Khammam Today,Kanti Velugu in Khammam,Telangana Chief Minister KCR,Along with Other CMs,Launches The Second Phase,Kanti Velugu in Khammam Latest News And Updates,Mango news,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం రెండో విడుతను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మూడు రాష్ట్రాల (కేరళ, ఢిల్లీ, పంజాబ్‌) ముఖ్యమంత్రులు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తో పాటు ఉత్తరప్రదేశ్ (యూపీ) మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితరులతో కలిసి ప్రారంభించారు. బుధవారం ఖమ్మం పర్యటనలో ఉన్న వారు నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కంటి వెలుగు లబ్ధిదారులకు సీఎంలు కేసీఆర్‌, పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌, జాతీయ నేతలు అఖిలేశ్‌ యాదవ్‌, రాజాలు కంటి అద్దాలను అందజేశారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమం గురించి జాతీయ నేతలకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలు వివరించారు.

కాగా రూ. 200 కోట్ల వ్యయంతో తెలంగాణ వ్యాప్తంగా సామూహిక కంటి స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు కోటి యాభై లక్షల మందిని కవర్ చేయనుంది. ఇక ఈ ప్రక్రియలో దృష్టిలోపంతో బాధపడేవారికి ప్రభుత్వం సుమారు 55 లక్షల కంటి అద్దాలు మరియు మందులను ఉచితంగా అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 16,533 ప్రాంతాల్లో నిర్వహించే ఈ కంటి వెలుగు శిబిరాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శిబిరాలకు అవసరమైన వైద్య పరికరాలు, రీడింగ్ గ్లాసులు, అర్హులైన లబ్ధిదారులకు మందులు పంపిణీ వంటివి వీటిలో ఉన్నాయి. ఇక కంటి వెలుగు మొదటి దశకు ఎనిమిది నెలల సమయం పట్టగా.. ఈ రెండో దశను 100 పనిదినాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =