సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోండి – పార్టీ నేతలకు ప్రధాని మోదీ కీలక సూచన

PM Narendra Modi Asks BJP Leaders To Refrain From Making Unnecessary Comments Against Movies,PM Narendra Modi,Asks BJP Leaders,To Refrain From Making,Unnecessary Comments,Against Movies,Mango news,Mango News Telugu,BRS Party Public Meeting,BRS Party Khammam Public Meeting,CM Kejriwal,CM Vijayan,CM Bhagwantman,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ నాయకులకు కీలక సూచన చేశారు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో చివరి రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సినిమాలు మరియు వ్యక్తులపై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, మనం పడే కష్టం మరియు చేసే శ్రమ పక్కకు వెళ్లే విధంగా ఎవరూ అనవసర వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం లోని ఒక పాట చిత్రీకరణపై ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడం తెలిసిందే.

అలాగే దీనిపై బీజేపీకి చెందిన రామ్ కదమ్ మరియు నరోత్తమ్ మిశ్రా వంటి పలువురు నాయకులు ‘బేషరమ్ రంగ్’ పాటలో నటి దీపికా పదుకొణె వస్త్రధారణపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పాటలో దీపిక ధరించిన కుంకుమపువ్వు బికినీ వలన హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మేకర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, సినిమాని బహిష్కరించాలని పిలుపునివ్వడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం విశేషం. బోహ్రాలు, పస్మాందాలు మరియు సిక్కులు వంటి మైనారిటీలతో సహా సమాజంలోని ప్రతి వర్గాన్ని దరి చేర్చుకోవాలని మరియు ఎన్నికలే లక్ష్యంగా కాకుండా వారి కోసం పని చేయాలని బిజెపి సభ్యులను కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 9 =