నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చి 2న ఫలితాలు

ECI Releases Nagaland Meghalaya and Tripura Assembly Elections-2023 Schedule Results will Declared on March 2,ECI Releases Nagaland, Meghalaya and Tripura Assembly Elections-2023 Schedule, Results will Declared on March 2,Mango News,Mango News Telugu,Nagaland Elections-2023 Schedule,Meghalaya Elections-2023 Schedule,Tripura Assembly Elections-2023 Schedule,Nagaland,Meghalaya,Tripura,Elections-2023 Schedule,Elections-2023

దేశంలోని నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు (జనవరి 18, బుధవారం) విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. నాగాలాండ్ లో 60, మేఘాలయలో 60, త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16వ తేదీన, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. మూడు రాష్ట్రాల్లో కూడా ఒక విడతలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మార్చి 2వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపారు.

ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 180 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 9,125 పోలింగ్ కేంద్రాల్లో 62.8 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందులో 1.76 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని 80 ఏళ్లు పైబడినవారికీ, వికలాంగులకు మరియు అవసరమైన సేవల్లో పాల్గొన్న వారికి కల్పించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (60):

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: జనవరి 21
  • నామినేషన్ చివరి రోజు: జనవరి 30
  • నామినేషన్ల పరిశీలన: జనవరి 31
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 2
  • పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 16
  • ఓట్ల లెక్కింపు తేదీ: మార్చి 2

నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (60):

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: జనవరి 31
  • నామినేషన్ చివరి రోజు: ఫిబ్రవరి 7
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 8
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 10
  • పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27
  • ఓట్ల లెక్కింపు తేదీ: మార్చి 2

మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (60):

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: జనవరి 31
  • నామినేషన్ చివరి రోజు: ఫిబ్రవరి 7
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 8
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 10
  • పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27
  • ఓట్ల లెక్కింపు తేదీ: మార్చి 2.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + nine =