రాష్ట్రంలో 6 నుండి 8 తరగతుల ప్రారంభంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: సీఎస్

Classes for 6 7 and 8th Class students will Commence in Telangana, Commencement of 6 to 8 Classes, Commencement of 6 to 8 Classes In Telangana, Mango News, Sabitha Indra Reddy, students will Commence in Telangana, Telangana CS, Telangana CS held Teleconference with District Collectors, Telangana CS Somesh Kumar, Telangana Education Department, Telangana Education Minister, Telangana Schools, Telangana schools opening, Telangana Schools Reopen, Telangana Schools Reopen News, Telangana Schools Reopening, Telangana Schools Reopening News, Telangana Schools Reopening Updates, Telangana Schools Started

రాష్ట్రంలో 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను రేపటి నుండి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, డీఈఓలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి శాఖలకు సంబంధించిన జిల్లా సంక్షేమ అధికారులతో మంగళవారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులను వీలైన మేరకు రేపటి నుండి లేదా మార్చి 1వ తేదీ లోగా ప్రారంభించాలని సీఎస్ ఆదేశించారు.

6 నుండి 8 వ తరగతులకు సంబంధించి 17.24 లక్షల మంది విద్యార్ధులతో పాటు ఇప్పటికే హాజరవుతున్న విద్యార్ధులు కూడా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి ఎడ్యూకేషన్ మానిటరింగ్ కమీటీలు సమావేశమై 6 నుండి 8 వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్ధుల భద్రత కోసం తగు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. పాఠశాలలను మొదటిసారి ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, బీసి సంక్షేమ కార్యదర్శి బి.వెంకటేశం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు దేవసేన, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =