అయోధ్య విమానాశ్రయానికి పేరు ఖరారు, బడ్జెట్ లో నిధులు కేటాయింపు

Ayodhya Airport, Ayodhya Airport as Maryada Purushottam Sri Ram Airport, Ayodhya airport renamed as Maryada Purushottam, Maryada Purushottam, Maryada Purushottam Sri Ram Airport, UP Govt, UP Govt has Renamed Ayodhya Airport, UP Govt has Renamed Ayodhya Airport as Maryada Purushottam Sri Ram Airport, Uttar Pradesh

అయోధ్యలో ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న విమానాశ్రయానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరు ఖరారు చేసింది. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయోధ్యలో విమానాశ్రయానికి ‘మర్యాద పురుషోత్తమ్‌ శ్రీరామ్‌ విమానాశ్రయం’ అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. బడ్జెట్ లో ఈ విమానాశ్రయం కోసం రూ.101 కోట్లు కేటాయించారు. దశలవారీగా ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.

ముందుగా సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2021 సంవత్సరానికి గానూ అసెంబ్లీలో 5,50,270 కోట్లతో బ‌డ్జెట్ ‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ బడ్జెట్ లో అయోధ్య, వారణాసి, చిత్రకూట్ వంటి దేవాలయాల ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ముఖ్యంగా అయోధ్య రామమందిరానికి, అయోధ్య ధామానికి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు కోసం రూ.300 కోట్లు కేటాయించింది. అలాగే అయోధ్య నగర అభివృద్ధి కోసం మరో రూ.140 కోట్లు, అయోధ్యలో టూరిజం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − seven =