సచివాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2023, పాల్గొన్న సీఎస్ శాంతి కుమారి

Telangana CS Santhi Kumari Participated In International Women's Day Celebrations-2023 In The Secretariat,Telangana CS Santhi Kumari,International Women's Day Celebrations-2023,Women's Day Celebrations-2023 In The Secretariat,CS Santhi Kumari Participated In Women's Day,Mango News,Mango News Telugu,Senior IAS Officer Santhi Kumari,Women's Day Celebrations,Telangana Women's Day Celebrations,Women's Day Latest News,Women's Day Live News,Telangana Latest News And Updates,CS Santhi Kumari Latest Updates

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, దీనిలో భాగంగా అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి పేర్కొన్నారు. మహిళలు సమైక్యంగా, సమన్వయంతో ఉంటేనే తమ హక్కుల సాధనకు మార్గం ఏర్పడుతుందని సీఎస్ శాంతి కుమారి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ లో తెలంగాణ సచివాలయ మహిళా అధికారులు, సిబ్బంది నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు సీఎస్ శాంతి కుమారి ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధులుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఆర్థిక శాఖ కార్యదర్శి టికే శ్రీదేవి, ప్రశాంతి, సచివాలయ మహిళా ఉద్యోగ సంఘం నాయకురాలు చిట్టి రాణి, ఎం.మంగమ్మ, ఉమా నాగలక్ష్మి, షైక్ మాలిక, కరుణ రెడ్డి, చంద్రకళ, సింధూరి, శైలజ, విజయ నళిని, విజయ లక్ష్మి, చందన, అలేఖ్య, స్ఫూర్తి లతో పాటు పెద్ద ఎత్తున మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =