కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది?

Is That KCRs Immediate Duty,KCRs Immediate Duty,KCRs Duty,KCR, KCRs strategy, Leaders counting, votes, Telangana Election, BJP,BRS, Congress,BSP, CPI, CPM,Mango News,Mango News Telugu,KCRs strategy Latest News,KCRs strategy Latest Updates,Telangana Elections Latest News,Telangana Politics,Telangana Elections Latest Updates,Assembly Elections 2023 highlights,BJP Latest News,BRS Latest Updates
KCR, KCR's strategy, Leaders counting, votes, Telangana Election, BJP,BRS, Congress,Bsp, CPI, CPM

తెలంగాణలో పదేళ్లుగా అధికారపార్టీగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికలతో అధికారాన్ని కోల్పోయింది. దీంతో మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ .. ఇక నుంచి ప్రతిపక్ష నేతగా అందరికీ  కనిపించనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇప్పటి వరకూ తానే సీఎంగా ఉంటూ వచ్చిన కేసీఆర్.. ఇకపై ఏం చేయనున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. దీంతో కేసీఆర్ ముందున్న లక్ష్యాలేంటి ? పార్టీ బలోపేతం కోసం  కేసీఆర్ ఎలాంటి వ్యూహరచన చేయనున్నారనే అంశాలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ గా మారాయి.

2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారు. 2023 తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్‌గా మారిన గులాబీ పార్టీని కేవలం 39 స్థానాలకే పరిమితం చేశారు. దీంతో ఇప్పటికే తమ ఓటమికి కారణాలు వెతకడంతో పాటు..కారు పార్టీలో జరిగిన లోటుపాట్లపై కేసీఆర్ దృష్టి సారించారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఎన్నికల్లో ఎదురయిన పరాభవాన్ని.. గుణపాఠంగా భావించిన గులాబీ బాస్.. పార్టీకి తిరిగి పూర్వవైభవం తేవడానికి ఎలాంటి వ్యూహాలు రచించాలా అన్న ఆలోచనలో పడ్డారట. ప్రాంతీయవాదమే ప్రధాన ఎజెండాగా ఏర్పడిన టీఆర్‌ఎస్ పార్టీని పేరును బీఆర్‌ఎస్‌గా నామకరణం చేయడం కూడా   ఈ ఎన్నికల్లో  ఓటమికి కారణంగా చెబుతున్నారు  రాజకీయ విశ్లేషకులు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా..టీఆర్ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీ‌ఆర్‌కు తన రాష్ట్రంలోనే ఊహించని పరాభవం ఎదురవడంతో.. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ చేస్తారా లేక ఇప్పటికే తనకు తెలీకుండానే బాగా డ్యామేజ్ అయిన తమ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రయత్నిస్తారా  అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు   నేషనల్ పాలిటిక్స్‌లో  తమ సత్తా చాటాలని ఎప్పటి నుంచో  చూస్తున్న కేసీఆర్.. ఇకపై జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ  ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని కొంతమంది  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఇక ఇప్పటికే మహారాష్ట్రలో కొంత వరకూ తమ పార్టీని  విస్తరించిన కేసీఆర్..ఇప్పుడు తగిన సమయం దొరకడంతో మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది.

మరోవైపు 2024లో  పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.  అయితే వీటితో పాటు మరో మూడు రాష్ట్రాల్లోనూ శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో కేసీఆర్ ఫోకస్ అంతా పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఉండే అవకాశం ఉంటుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు పనిలోపనిగా ఆంధ్రప్రదేశ్‌లో  కూడా బీఆర్‌ఎస్ బలోపేతంపై కేసిఆర్ దృష్టి సారించే అవకాశాలూ లేకపోలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరి అంచనాలకు అంత ఈజీగా అందని కేసీఆర్ కొద్ది రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారో చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 19 =