ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలో సీబీఐ సోదాలు

Land For Jobs Case CBI Conducts Raids On Former Bihar CM Rabri Devi Residence At Patna,Land For Jobs Case CBI Conducts Raids,CBI Raids On Former Bihar CM,CBI Raids On Rabri Devi Residence,Former Bihar CM Rabri Devi Residence At Patna,Mango News,Mango News Telugu,CBI Conducts Raid At Official Residence,CBI Questions Former Bihar CM,Land-For-Job Scam,CBI Visits Rabri Devi's Patna Residence,Bihar CM Rabri Devi Latest News And Updates.Bihar CM Rabri Devi Live News,Patna Latest News Today

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ల్యాండ్ ఫర్ జాబ్ (ఐఆర్‌సీటీసీ) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోమవారం నాడు సోదాలు జరిపింది. ఈ మేరకు సీబీఐ అధికారుల బృందం ఈరోజు పాట్నాలోని ఆమె నివాసానికి చేరుకుని ల్యాండ్ ఫర్ జాబ్ కేసు విచారణకు సంబంధించి ఆమెను ప్రశ్నించింది. రబ్రీ దేవి కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ విధానసభకు వెళ్లిన కొద్ది సేపటికే సీబీఐ బృందం రబ్రీదేవి ఇంటికి చేరుకుంది. ఇక ఐఆర్‌సీటీసీ స్కామ్ కేసులో వారం రోజుల క్రితం రబ్రీ దేవికి, ఆమె భర్త, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో సీబీఐ సోదాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రబ్రీ దేవి నివాసంపై సీబీఐ దాడుల సందర్భంగా, ఇక్కడ ఎలాంటి సోదాలు, దాడులు జరగడం లేదని, కేసు తదుపరి విచారణకు సంబంధించి మాజీ సీఎం రబ్రీ దేవిని ప్రశ్నించడానికి వచ్చామని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ ఉద్యోగాలు ఇప్పించేందుకు లంచంగా భూమి ప్లాట్లు తీసుకున్నారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా గతేడాది అక్టోబర్‌లో 16 మంది నిందితుల్లో లాలూ ప్రసాద్‌, రబ్రీ దేవి, మీసా భారతిలపై ఏజెన్సీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్ చేయబడిన వారిలో వీరితో పాటు మరో ఇద్దరు సీనియర్ భారతీయ రైల్వే అధికారులు కూడా ఉన్నారని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో విచారణలో, నిందితులు అప్పటి సెంట్రల్ రైల్వేస్ జీఎం మరియు సీపీఓతో కలిసి కుట్ర పన్నారని, వారి పేరు మీద లేదా వారి దగ్గరి బంధువుల పేరుతో భూమిని బదలాయించారని గుర్తించింది. ఇక ఈ భూమిని మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకు సేకరించారని, అభ్యర్థులు తప్పుడు ధృవీకరణ పత్రాలను రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు ఆధారాలు లభించాయని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 1 =