ఆక్సిజన్ రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు : సీఎస్

Telangana CS Somesh Kumar held Review on Oxygen Tankers Transportation,Mango News,Mango News Telugu,Telangana CS Somesh Kumar,CS Somesh Kumar,Somesh Kumar,Telangana CS Somesh Kumar Latest News,CS Somesh Kumar News,CS Somesh Kumar Live,CS Somesh Kumar Live Updates,CS Somesh Kumar Pressmeet,CS Somesh Kumar Speech,Telangana,Telangana News,Covid-19,Coronavirus,Covid-19 In Telangana,Oxygen Tankers Transportation,Oxygen Tankers,Telangana CS Review on Oxygen Tankers Transportation,Telangana CS Review,Police To Escort Oxygen Tankers In Telangana,Oxygen Tankers In Telangana,Telangana Oxygen Tankers,Oxygen Supply,Telangana CS To Officials,Telangana CS On Oxygen Supply

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు, ఆర్టీసీ అధికారులతో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించి, తిరిగి తెప్పించుటలో వేగాన్ని పెంచుటకై చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒడిశాలోని అంగూర్ నుండి, కర్టాటకలోని బళ్లారి నుండి మెడికల్ ఆక్సిజన్ ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నామని సీఎస్ తెలిపారు. రవాణాలో జాప్యాన్ని నివారించుటకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలతో పాటు, మెకానిక్ లు, ఇతర నిపుణుల బృందాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంకర్లతో ప్రయాణించే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ కు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ సదుపాయాన్ని వినియోగించుటకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తద్వారా అంగూర్ కు ప్రయాణ సమయాన్ని ఆరు రోజుల నుండి మూడు రోజులకు తగ్గించగలుగుతామని పేర్కొన్నారు. కార్గో విమానాల ద్వారా సులభంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించుటకు అనువుగా ట్యాంకర్లకు తగు మార్పులు చేయాలని అధికారులకు సూచించారు.

నిర్దేశిత పాయింట్లకు ఆక్సిజన్ ట్యాంకర్లను నడపుటకు 24 గంటలు పని చేసే విధంగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ ల బృందాలను ఏర్పాటు చేయాలని రవాణా అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ప్రస్తుతం వున్న 30 ఆక్సిజన్ ట్యాంకర్లకు అదనంగా మరికొన్ని ట్యాంకర్లను సమకూర్చుకొనుటకు ప్రైవేట్ కాంట్రాక్టర్లతో చర్చించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, జి.ఏ,డి ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సిఐజి శేషాద్రి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్ధిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 4 =