మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 15 వరకు కఠిన జనతా కర్ఫ్యూ విధింపు

Madhya Pradesh CM Shivraj Singh Chouhan Imposes Full Lockdown in State till May 15,Mango News,Mango News Telugu,Madhya Pradesh Lockdown,Madhya Pradesh Lockdown News,Madhya Pradesh Lockdown Latest Updates,Madhya Pradesh Lockdown Live Updates,Madhya Pradesh,MP Lockdown,Madhya Pradesh lockdown Janta Curfew May 15,Janta Curfew,Full Lockdown Imposed In MP Till May 15,Lockdown in Madhya Pradesh Till May 15,CM Shivraj Singh,CM Shivraj Singh Live,CM Shivraj Singh Live Updates,CM Shivraj Singh Live News,CM Shivraj Singh Latest News,CM Shivraj Singh Pressmeet,Lockdown in Madhya Pradesh,Full Lockdown in Madhya Pradesh Till May 15

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నాడు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని బ్రేక్ చేసేందుకు మే 15వ తేదీ వరకు కఠిన జనతా కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కార్యకలాపాలను ఎక్కువరోజులు నిలిపివేయలేము, అలాగని 18% కంటే ఎక్కువ కరోనా పాజిటివిటి రేటు ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేకుండా ఉండలేమని పేర్కొన్నారు.

వివాహాలు, ఇతర సంబంధిత కార్యక్రమాల కారణంగా వైరస్ చాలా వేగంగా వ్యాప్తిచెందుతుందని, మే నెలలో వివాహాలు జరపకుండా ప్రజలను చైతన్యపరచాలని ప్రజా ప్రతినిధులందరిని కోరుతున్నానని అన్నారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్సకు ఎక్కువ డబ్బును వసూలు చేస్తునట్టు ఫిర్యాదులు అందుతున్నాయి, ఈ మహమ్మారి సమయంలో ప్రజలను దోచుకునే ఆసుపత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,37,406 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,42,632 మంది కరోనా నుంచి కోలుకోగా, 6,160 మంది మరణించారు. ప్రస్తుతం 88,614 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 1 =