ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు.. అరుదైన గౌరవం

Olympic Gold Medalist Neeraj Chopra To Be Honoured with Param Vishisht Seva Medal on Republic Day Eve,Mango News,Mango News Telugu,Olympic Gold Medalist Neeraj Chopra,Gold Medalist Neeraj Chopra,Neeraj Chopra,Neeraj Chopra Latest News,Neeraj Chopra News,Neeraj Chopra Latest Updates,Olympic Gold Medalist Neeraj Chopra News,Param Vishisht Seva Medal,Param Vishisht Seva,Republic Day,73rd Republic Day,Neeraj Chopra To Be Honoured with Param Vishisht Seva Medal,Olympian Neeraj Chopra Gets Param Vishisht Seva Medal,Param Vishisht Seva Medal For Olympic Champion Subedar Neeraj Chopra,Neeraj Chopra To Receive Param Vishisht Seva Medal,Neeraj Chopra Param Vishisht Seva Medal,Neeraj Chopra To Be Awarded With Param Vishisht Seva,Param Vishisht Seva Medal Neeraj Chopra,Neeraj Chopra Awarded Param Vishisht Seva Medal,#NeerajChopra

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రాకు ఒక అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నీరజ్‌ చోప్రాను ‘పరమ విశిష్ట సేవా పతకం’తో సత్కరించనుంది. రేపు (జనవరి 26) రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేతుల మీదుగా నీరజ్‌చోప్రాకు పతకం అందుకోనున్నాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా నీరజ్‌ చోప్రా రికార్డ్ సృష్టించాడు.

నీరజ్ గత సంవత్సరం దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డును అందుకున్నాడు. ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీలో నీరజ్‌ చోప్రా జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో.. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 384 మంది రక్షణ సిబ్బందిని గ్యాలంటరీ మరియు ఇతర అవార్డులతో సత్కరించనున్నారు.

రేపు రాష్ట్రపతి ఇవ్వనున్న అవార్డులలో.. 12 శౌర్య చక్రాలు, 29 పరమ విశిష్ట సేవా పతకాలు, నాలుగు ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 53 అతి విశిష్ట సేవా పతకాలు, 13 యుద్ధ సేవా పతకాలు, మూడు బార్ టు విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి. వీటితో పాటు మరో 122 విశిష్ట సేవా పతకాలు, 81 సేన పతకాలు, రెండు వాయు సేన పతకాలు, 40 సేన పతకాలు, ఎనిమిది నేవీసేన పతకాలు, 14 నావో సేన పతకాలతో విజేతలను రాష్ట్రపతి సత్కరిస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here