తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

Telangana Education Minister Sabitha Indra Reddy Releases Tenth Class-2022 Results, Education Minister Sabitha Indra Reddy Releases Tenth Class-2022 Results, Minister Sabitha Indra Reddy Releases Tenth Class-2022 Results, Sabitha Indra Reddy Releases Tenth Class-2022 Results, Telangana Education Minister Releases Tenth Class-2022 Results, Tenth Class-2022 Results, 2022 Tenth Class Results, Tenth Class Results, Ts Tenth Class Results, Telangana Education Minister Sabitha Indra Reddy, Education Minister Sabitha Indra Reddy, Minister Sabitha Indra Reddy, Telangana Education Minister, Telangana Tenth Class-2022 Results News, Telangana Tenth Class-2022 Results Latest News, Telangana Tenth Class-2022 Results Latest Updates, Telangana Tenth Class-2022 Results Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. పదో తరగతి ఫలితాలను https://bse.telangana.gov.in/, https://bseresults.telangana.gov.in/ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ పరీక్షలకు 5,03,579 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారని చెప్పారు. దీంతో పదోతరగతి ఫ‌లితాల్లో మొత్తం 90 శాతం ఉత్తీర్ణ‌త నమోదైందన్నారు. ఇందులో బాలురు 87.61 శాతం, బాలికలు 92.45 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. ఇక ప్రైవేట్ గా 819 మంది హాజ‌రు కాగా 425 మంది పాస‌య్యారని 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారని చెప్పారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

పదో తరగతి ఉత్తీర్ణతలో బాలికలదే పై చేయిగా ఉంది. మరోవైపు రీకౌంటింగ్/రెవెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తామని, రెవెరిఫికేషన్ వారికీ ఆన్సర్ పేపర్ జిరాక్స్ కూడా అందజేస్తామని అన్నారు. ఇక పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, రెండో స్థానంలో నిర్మల్, మూడోస్థానంలో సంగారెడ్డి ఉన్నాయన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =