కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

PJR's Daughter TRS Corporator Vijaya Reddy Joins Congress Today, TRS Corporator Vijaya Reddy Joins Congress Today, PJR's Daughter Joins Congress Today, Vijaya Reddy Joins Congress Today, TRS Corporator Joins Congress Today, TRS Corporator from Khairatabad Vijaya Reddy has joined Congress party, Vijaya Reddy has joined Congress party, TRS Corporator from Khairatabad has joined Congress party, Khairatabad TRS Corporator, TRS Corporator, P Janardan Reddy's daughter Vijaya Reddy quits TRS, P Janardan Reddy's daughter Vijaya Reddy Joins Congress Today, Indian National Congress, Vijaya Reddy Joins Congress News, Vijaya Reddy Joins Congress Latest News, Vijaya Reddy Joins Congress Latest Updates, Vijaya Reddy Joins Congress Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి (పీజేఆర్) కూతురు, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మల్లు రవి, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. పీజేఆర్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని, మళ్ళీ ఇంటి పార్టీలోకి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని, తాను పదవుల కోసం పార్టీ మారలేదని, ఇకపై మూడు రంగుల జెండా వదలేది లేదని విజయా రెడ్డి స్పష్టం చేశారు.

ఖైరతాబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటానని, తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని విజయా రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అప్పచెప్పిన అన్ని పనులను చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వలేదని, టీఆర్‌ఎస్‌ పార్టీలో మహిళల తరపున సరైన పోరాటం చేయలేమని భావించినందువల్లే పార్టీని వీడినట్లు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, మహిళలపై జరుగుతున్న దాడులను మాత్రం ఆపలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో, దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఈ క్రమంలో సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికే కాంగ్రెస్‌లోకి వచ్చానని విజయా రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here