రేపు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్న దామోద‌ర్ రావు, పార్థసారథి రెడ్డి

TRS Leaders Damodar Rao Bandi Parthasaradhi Reddy to Take Oath as Rajya Sabha MPs Tomorrow, TRS Leader Bandi Parthasaradhi Reddy to Take Oath as Rajya Sabha MPs Tomorrow, TRS Leader Damodar Rao to Take Oath as Rajya Sabha MPs Tomorrow, Rajya Sabha MPs, TRS Leader Bandi Parthasaradhi Reddy, TRS Leader Damodar Rao, TRS Leaders Damodar Rao And Bandi Parthasaradhi Reddy, Damodar Rao And Bandi Parthasaradhi Reddy, Bandi Parthasaradhi Reddy, Damodar Rao, Oath as Rajya Sabha MPs, Hetero Group chairman and managing director Bandi Parthasaradhi Reddy, Telangana Publication chairman and managing director D Damodar Rao, Rajya Sabha MPs News, Rajya Sabha MPs Latest News, Rajya Sabha MPs Latest Updates, Rajya Sabha MPs Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవలే న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ పార్థ‌సార‌థి రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు (జూన్ 24, శుక్రవారం) వారివురూ ఢిల్లీలో రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేసి, తమ పదవీ బాధ్య‌తలు స్వీక‌రిం‌చ‌ను‌న్నారు. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంక‌య్య‌నా‌యుడు తన కార్యా‌ల‌యంలో దామోద‌ర్ రావు, పార్థ‌సార‌థి రెడ్డిల చేత రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు.

ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్ ల యొక్క రాజ్యసభ పదవీకాలం జూన్ 21, 2022తో పూర్తవనుండడంతో, ఈ స్థానాలకు మే 24న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా దామోద‌ర్ రావు, పార్థ‌సార‌థి రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీరు నామినేషన్స్ దాఖలు చేయడం మరియు ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి రాజ్యసభ ఎంపీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి, ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి జూన్ 4న వీరిద్దరికి ధ్రువీకరణ ప‌త్రాలను అందజేశారు. ఈ క్రమంలోనే రేపు దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here