తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు ఈరోజు తిడతారు, రేపు పథకాలకు అవార్డులిస్తారు – సీఎం కేసీఆర్

CM KCR Fires on Union Ministers Over Their Dual Stance on Telangana State in Public Meeting Warangal, CM KCR Fires on Union Ministers, CM KCR Slams Union Ministers, CM KCR Comments On Central Ministers, Mango News, Mango News Telugu, Union Ministers , Dual Stance on Telangana State, Public Meeting Warangal, CM KCR Fires on Dual Stance on Telangana State, CM KCR On Central Ministers, CM KCR, Telangana CM KCR, CM KCR Latest News And Updates, Telangana CM, Telangana News And Live Updates

తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రుల‌పై మండిప‌డ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు తిడతారని, రేపు మళ్ళీ వారే మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతమైనవంటూ ఢిల్లీలో అవార్డులు ఇస్తుంటారని విమర్శించారు. శనివారం వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అన్ని రంగాల్లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచిందని, దీనికి కేంద్రం ప్రకటిస్తున్న అవార్డులు నిదర్శనమని పేర్కొన్నారు. వైద్య రంగంలో అద్భుతాలు సాధించామని చెప్పిన ఆయన, రాష్ట్రం ఏర్పడక ముందు ఐదు కాలేజీలు మాత్ర‌మే ఉండేవని, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కొత్త‌గా 12 కాలేజీలు మంజూరు చేశామని గుర్తు చేశారు. అప్పుడు 2800 మెడిక‌ల్ సీట్లు ఉంటే, నేడు 6500 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయని, ఇక రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వ‌స్తే 10 వేలు దాటే అవ‌కాశం ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ త‌యార‌వుతోందని, దీనిలో భాగంగా ముందుగా సిరిసిల్ల‌, ములుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 శాతం హెల్త్ ప్రొఫైల్‌ను ప్ర‌యోగ‌త్మ‌కంగా త‌యారు చేశామని ఆయన తెలిపారు. దీని ద్వారా ఒక వ్య‌క్తికి ఏ ర‌క‌మైన అనారోగ్యం వ‌చ్చినా, ఈ ప్రొఫైల్ చూసి వెంటనే వైద్యం ప్రారంభిస్తారని వెల్లడించారు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెడుతుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రాలకు నిధులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నాయకులు వారి స్వార్ధ రాజ‌కీయాల కోసం దేశాన్ని విడగొడుతున్నారని, తెలంగాణ యువత వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులుగా, యువ‌కులుగా ఈ దేశ భ‌విష్య‌త్ మీ చేతుల్లో ఉందని, ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ముందుకు పోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 18 =