యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

Finance Health Minister Harish Rao, Harish Rao Visits Yadadri Temple, Mango News, Mango News Telugu, Minister Harish Rao, Minister Harish Rao Visit Yadadri, Minister Harish Rao Visits Yadadri Temple, Minister Harish Rao Visits Yadadri Temple Today, Telangana Finance, Telangana Finance Health Minister Harish Rao, Telangana Finance Health Minister Harish Rao Visits Yadadri Temple Today, yadadri temple, Yadadri Temple as a spiritual place, Yadadri temple news

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ పక్షాన యాదాద్రి ఆలయ గోపుర బంగారు తాపడ నిర్మాణానికి కిలో బంగారాన్ని విరాళంగా ఆలయ ఈవోకు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణం దాదాపుగా పూర్తి అయిందని అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుండి ప్రస్తుతం ఒక కిలో బంగారం సమర్పించడం జరిగిందని, మరో కిలో బంగారం కూడా సమర్పించనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు దాతల నుండి, భక్తుల నుండి దాదాపు 35 కేజీల బంగారం సమకూరగా, మరో 45 కేజీల బంగారం దాతలు, ఇతర భక్తులు ఇస్తాం అని చెప్పారన్నారు. బంగారు గోపురం తాపడానికి కావాల్సిన బంగారం దాతల నుండి అందుతుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మాణం అద్భుతంగా చేపట్టారని, రానున్న రోజుల్లో గొప్ప ఆలయంగా యాదాద్రి ఆలయం ఉంటుందన్నారు. దేశంలోనే మంచి పర్యటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిలువనుందని అన్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా సూచన మేరకు యాదాద్రిలో 100 పడకల హాస్పిటల్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here