నేటి నుంచి రాత్రి 9:30 గంటలవరకు హైదరాబాద్ మెట్రో రైల్ సేవలు

Hyderabad Metro, Hyderabad Metro Decides to Run Trains, Hyderabad Metro Decides to Run Trains Till 9 30 PM, Hyderabad Metro Latest News, Hyderabad Metro News, Hyderabad Metro Rail, hyderabad metro rail limited, Hyderabad Metro Timings, Hyderabad Metro Trains, telangana

కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముందుగా కొన్ని రోజులు పాటు మూడు కారిడార్లలో ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడిపించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లను నడుపుతున్నారు. తాజాగా ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 28, బుధవారం నుంచి మెట్రో రైళ్లు తిరిగే సమయాన్ని మరో అరగంట పొడిగించి రాత్రి 9.30 గంటల వరకు సేవల్ని అందుబాటులోకి తెస్తున్నామని, ప్రయాణికులు అందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే ఈ రోజు నుండి రాత్రి 9.30 వరకు ప్రతి మూడు నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 20 =