మోడల్ స్కూల్స్ టీచర్లకు నూతన పే స్కేల్, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Telangana Govt Announced New Pay Scale For Model Schools Staff

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్ లో పనిచేసే బోధనా, బోధనేతర సిబ్బందికి వేతనాలు పెంచింది. వీరికి కూడా ప్రభుత్వం ప్రకటించిన కొత్త 30 శాతం పీఆర్సీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నూతన పే స్కేల్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు 3 వేల మంది మోడల్ స్కూల్స్ టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం చేకూరనుంది. కొత్త పీఆర్సీ ప్రకారం మోడల్ స్కూల్స్ లోని ప్రిన్సిపాల్స్ కు రూ.58,850-1,37,050, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (పీజీటీ) రూ.45,960-1,24,150, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లకు (టీజీటీ) రూ.42,300-1,15,270 పే స్కేల్ అమలు కానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + seventeen =