తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనం పెంపు

Telangana Govt Enhances 30 Percent of Honorarium to Sarpanch, MPTC, MPP, ZPTCs,Salaries Of Telangana's Elected Local Body Representatives,Telangana Sarpanch,Ts Panchayat Representatives Honorarium Hiked By 30%,Mango News,Mango News Telugu,Telangana Govt,Telangana,Telangana News,Telangana Latest News,Telangana Sarpanch Honorarium,Mandal Parishad Territorial Constituency,Zilla Parishad Territorial Constituency members,Panchayat Raj Secretary Sandeep Kumar Sultania,Finance Minister T Harish Rao,Telangana MPTC,Telangana Sarpanch Salaries,Telangana Govt Enhances 30 Percent,T Harish Rao,CM KCR

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను 30 శాతం మేర పెంచారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు జెడ్పీటీసీలు, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. అలాగే ఎంపీటీసీలు, సర్పంచుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.6,500 కు పెరిగింది. ప్రభుత్వం పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచడంపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + twenty =