తెలంగాణ అసెంబ్లీ 3 రోజులు వాయిదా, తిరిగి అక్టోబ‌ర్ 1న ప్రారంభం

3-day break for Telangana Legislature session, Cyclone Gulab, Cyclone Gulab alert, Cyclone Gulab impact, Cyclone Gulab News, Cyclone Gulab Telangana, Cyclone Gulab Updates, Mango News, Telangana Assembly Adjourned, Telangana Assembly Adjourned for 3 Days, Telangana Assembly Adjourned for 3 Days due to Heavy Rain Situation, Telangana Assembly Adjourned for 3 Days due to Heavy Rain Situation in the State, Telangana Assembly Session, Telangana Assembly session adjourned, Telangana Assembly to reconvene on October 1

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 24న ప్రారంభమయిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో గులాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటుగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్టేట్ లెజిస్లేటివ్ సెక్రెటరీ వి.నరసింహా చార్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల వలన త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో క్షేత్ర స్థాయిలో ఉండి ప‌రిస్థితులను పర్యవేక్షించడం, సహాయక చర్యల్లో పాల్గొనడం, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండడం వంటి అంశాల దృష్ట్యా సమావేశాల వాయిదాకై సభ్యులు స్పీకర్ కు, ప్రొటెం ఛైర్మన్ కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అనంతరం దీనికి సంబంధించి సభా నాయకులు, మరియు సభల్లోని ఫ్లోర్ లీడర్స్ తో స్పీకర్, ప్రొటెం ఛైర్మన్ సంప్రదించి వాయిదాపై నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీంతో శాసనసభ, శాసన మండలి సమావేశాలు తిరిగి అక్టోబ‌ర్ 1వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు స‌మావేశం కానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + five =