పాన్ కార్డు-ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువు మార్చి 31, 2022 వరకు పొడిగించిన కేంద్రం

2022, Centre extends PAN-Aadhaar linking deadline, Deadline for linking Aadhaar with PAN card extended, Mango News, PAN-Aadhaar linkage deadline extended by six months, PAN-Aadhaar Linking, Pan-Aadhaar Linking Deadline, PAN-Aadhaar Linking Deadline Extended, PAN-Aadhaar Linking Deadline Extended till March 31st, PAN-Aadhaar Linking Deadline Extended till March 31st 2022, PAN-Aadhaar Linking Last Date, PAN-Aadhar linking deadline extended till March 31 next year

దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా వివిధ వాటాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ వాటాదారుల నుండి వచ్చిన ప్రతిపాదనలు, ప్రాతినిధ్యాలను పరిగణనలోకి తీసుకుని, 1961 ఆదాయపు పన్ను చట్టం కింద కొన్ని కంప్లైంట్‌ల కోసం గడువులను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అందులో భాగంగా పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరో ఆరు నెలలు అవకాశం కల్పించింది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే గడువును మార్చి 31, 2022 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పాన్-ఆధార్ అనుసంధానం కోసం చివరితేదిని సెప్టెంబర్ 30, 2021 గా ప్రకటించారు. అయితే దేశంలో కరోనా మహమ్మారి వలన ఉత్పన్నమవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును సెప్టెంబర్ 30, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు.

మరోవైపు 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పెనాల్టీ ప్రొసీడింగ్స్ పూర్తి చేసే గడువు కూడా సెప్టెంబర్ 30, 2021 నుండి మార్చి 31, 2022 వరకు పొడిగించారు. అలాగే బినామీ ప్రాపర్టీ లావాదేవీల నిషేధ చట్టం, 1988 ప్రకారం అడ్జుడికేటింగ్ అథారిటీ ద్వారా నోటీసు జారీ చేయడానికి మరియు ఉత్తర్వులు జారీ చేయడానికి కాలపరిమితి కూడా మార్చి 31, 2022 వరకు పొడిగించబడిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here