తెలంగాణలో మే 8 ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు

Telangana Govt Extends Night Curfew upto May 8th 5 AM,Coronavirus,Covid Vaccination,COVID-19,Covid-19 Updates in Telangana,Latest Breaking News 2021,Mango News,Telangana Coronavirus News,Telangana Covid News,Telangana COVID-19 News,Telangana Government,Telangana Night Curfew,Telangana Extends Night Curfew By 7 Days Till May 8,Night Curfew In Telangana Extended Till May 8,Night Curfew In Telangana Extended,Night Curfew In Telangana State Extended Till May 8,Covid-19 Second Wave,Telangana Government Extends Night Curfew,Telangana Lockdown,Coronavirus Live Updates,Night Curfew Extended Till May 8 In Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటలనుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.

ముందుగా కరోనా పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 20వ రాత్రి నుంచి నుంచి మే 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనాకేసులు పెరుగుదల కొనసాగుతుండడంతో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నైట్ కర్ఫ్యూ సమయంలో అన్ని కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, షాపింగ్‌మాల్స్‌, దుకాణాలు, థియేటర్లు, రెస్టారెంట్లు మొదలైనవి రాత్రి 8.00 గంటలకు మూసివేయాల్సి ఉంటుంది. ఇక ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు, ఇతర అవసరమైన సేవలకు మినహాయింపు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =