ఐఐఐటి చట్టాల స‌వ‌ర‌ణ బిల్లు-2020 కు ఆమోదం తెలిపిన రాజ్యసభ

IIIT Laws Amendment Bill, IIIT Laws Amendment Bill 2020, IIIT Laws Amendment Bill 2020 passed in Rajya Sabha, Indian Institute of Information Technology Laws Amendment Bill, Indian Institute of Information Technology Laws Amendment Bill 2020, Parliament passes IIIT Amendment Bill, rajya sabha, Rajya Sabha Passes Indian Institute of Information Technology Laws

ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లు-2020 కు మంగళవారం నాడు రాజ్య‌స‌భ‌ ఆమోదం తెలిపింది. ఐఐఐటి చట్టాల (సవరణ) బిల్లు -2020 ముఖ్యంగా 2014 మరియు 2017 యొక్క ప్రధాన చట్టాలను సవరిస్తుంది. ఈ బిల్లు ద్వారా దేశంలో సూరత్, భోపాల్, భ‌గ‌ల్‌పూర్‌, అగ‌ర్త‌లా మరియు రాయ్‌చూర్ ‌ల‌లో 5 ఐఐఐటీ లను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశంలో బలమైన పరిశోధనా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవసరమైన విద్యార్థులను ఆకర్షించడానికి ఈ బిల్లు ఐఐఐటీ లకు అనుమతి ఇవ్వనుంది.

ఐఐఐటి చట్టాల (సవరణ) బిల్లు -2020 ఆమోదం పొందడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లును ఆమోదించడంలో సహకరించిన రాజ్యసభ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐఐటి లు వినూత్న మరియు నాణ్యమైన పద్ధతుల ద్వారా ప్రోత్సహించడానికి ఈ బిల్లు ప్రోత్సహిస్తుందని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =