తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జీవో జారీ

Telangana Govt Issues GO No 33 Regarding ST Quota Reservation Hikes To 10 Percent, Telangana ST Quota Reservation Hikes, ST Quota Hike By Telangana Govt, Telangana Govt ST Quota GO, Mango News, Mango News Telugu, Telangana Govt Issues GO No 33, Telangana Govt Issues ST Quota Reservation Hikes, ST Quota Reservation Hikes, ST Quota Reservation Hikes GO No 33, ST Quota Increases By 10% , Telangana Government, Telangna Govt Latest News And Updates

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా, ఉద్యోగ రంగాల్లో షెడ్యూల్డ్ తెగలకు (ఎస్టీ) రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 17న ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జీవో ప్రకారం రాష్ట్రంలో ఇది నేటి నుంచే అమలులోకి రానుంది. దీంతో తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లు 54 శాతానికి చేరుకోనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పెంచిన కోటా తక్షణమే అమల్లోకి రానుంది.

కాగా తెలంగాణాలో ఎస్టీ, ముస్లిం (బీసీ-ఈ కేటగిరీ) రిజర్వేషన్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. గిరిజనులు అధికంగా ఉండటం మూలంగా తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీనికి ముందు రిజర్వేషన్ల పెంపు అధ్యయనం కోసం రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్‌ 15న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించగా, ఆ మరుసటి రోజు శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 6 =