పుతిన్‌ కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలు రష్యాలో విలీనం, నాటో దళాలకు ఎంట్రీ లేదని వెల్లడి

Russian President Vladimir Putin Recognises Independence of Four Ukraine Regions, Russian President Vladimir Putin, Vladimir Putin Independence of Four Ukraine Regions, Ukraine War, Vladimir Putin, Mango News, Mango News Telugu, Vladimir Putin Latest News And Updates, Russia Ukraine War Live Updates, Ukraine in Maps, Tracking Ukraine war with Russia, Ukraine Live News And Updates, Volodymyr Zelenskyy, Ukraine President Volodymyr Zelenskyy

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జాపోరిజ్జియా మరియు ఖెర్సన్ ప్రాంతాలు సహా మరో రెండు ప్రాంతాలను రష్యా విలీనాన్ని అధికారికంగా ఖరారు చేసింది. ఈ విలీన ఒప్పందంపై దొనెత్స్క్ , లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారు. అయితే దీనిని ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఖండించారు. దీనిని ప్రపంచ దేశాలు గుర్తించబోవని, వాస్తవాలను ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా రెఫరెండానికి విశ్వసనీయత లేదని అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు ప్రకటించాయని ఆయన గుర్తు చేశారు.

ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్‌ మాట్లాడుతూ.. ఈ నాలుగు ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించామని, ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 15శాతం భూభాగం రష్యాలో విలీనమైందని చెప్పారు. జపోరిజియాలో 93%, ఖేర్సన్ లో 87%, లుహాన్స్క్ లో 98%, దొనెత్స్క్ లో 99% మంది ప్రజలు రష్యాలో విలీనానికి అనుకూలంగా ఓటేసినట్లు తెలియజేశారు. ఇకపై ఈ ప్రాంతాలపై ఏదైనా దాడి జరిగితే అది రష్యాపై చేసిన దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ నాలుగు ప్రాంతాల విలీన ప్రక్రియను వచ్చే వారం రష్యన్‌ పార్లమెంట్‌ లో ఆమోదించనున్నామని వెల్లడించారు. ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు విలీనానికి మద్దతు తెలిపినట్లు ఆయన వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here