సచిన్ చేతుల మీదుగా.. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీ20 జట్టుకు రేపు బీసీసీఐ సత్కారం

BCCI and Sachin Tendulkar To Felicitate World Cup-Winning U19 Team Tomorrow at Ahmedabad,Under 19 World Cup 2023,Under 19 World Cup Live,Under 19 Cricket Live Score,Under 19 World Cup Final,Under 19 World Cup 2023 Schedule,Mango News,Mango News Telugu,Under 19 World Cup Winners List,Under 19 Cricket World Cup 2022 Schedule,Under-19 World Cup 2023,Under-19 Cricket Live Score,Under-19 World Cup Final,Under-19 World Cup 2023 Schedule,Under-19 World Cup Winners List,U19 T20 World Cup,U19 T20 World Cup 2022 Schedule,U19 T20 World Cup 2022,U19 T20 World Cup Winners List,U19 T20 World Cup Final,U19 T20 World Cup 2023,U19 T20 World Cup Live,U19 T20 World Cup Live Streaming,U19 T20 World Cup Women'S Live,U19 T20 World Cup Final 2023,U19 T20 World Cup Final Scorecard,U19 T20 World Cup Final Live Streaming,Under 19 T20 World Cup,Under 19 T20 World Cup Schedule,Under 19 T20 World Cup Live Score,Under 19 T20 World Cup Points Table,Under 19 T20 World Cup Final,Under 19 T20 World Cup Live

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల టీ20 జట్టుకు స్వదేశంలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత అండర్ 19 వుమెన్స్ టీమ్‌ను ఘనంగా సత్కరించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). కాగా ఈ క్రమంలో భారత మహిళల జట్టు ముందుగా దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి చేరుకుంటుంది. అక్కడ నుంచి నేరుగా రేపు జరుగనున్న సన్మాన కార్యక్రమం కోసం అహ్మదాబాద్ చేరుకోనుంది. నాడు ఈ కార్యక్రమం జరగనుంది. ఇక ఇదే వేదికపై బుధవారం నాడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 జరగనుంది.

భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఈ సత్కాక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న అహ్మాదాబాద్ వేదికగా భారత మహిళల టీ20 జట్టును సత్కరించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘భారతరత్న సచిన్ టెండూల్కర్, బీసీసీఐ కలిసి ఫిబ్రవరి 1వ తేదీని అహ్మదాబాద్ శ్రీ నరేంద్రమోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు అండర్ 19 జట్టును సత్కరించనున్నాం. ఈ యువ క్రికెటర్ల భారత్‌ను గర్వపడేలా చేశారు. వారి విజయాలను మేము గౌరవిస్తాము’ అని జైషా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వుమెన్స్ టీమ్‌ను మట్టి కురిపించిన భారత అమ్మాయిలు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని సాధించిన జట్టుగా రికార్డ్ సృష్టించారు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక ప్రపంచ కప్ గెలిచిన భారత అండర్ 19 మహిళల జట్టులో మన తెలుగు అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ లోని భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష ఫైనల్ మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులో నిలిచి 24 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + twelve =