తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతి ఉపసంహరణ

Telangana Govt Issues Order Withdraws The General Consent Granted To CBI, Telangana Govt, Govt Issues Order Withdraws, Govt Withdraws General Consent CBI,Mango News, Mango News Telugu, CBI Latest News And Updates, Telangana Govt Withdraws Consent Granted To CBI, Consent Granted To CBI, CBI, Central Bureau of Investigation, Central Bureau of Investigation News And Updates, Telangana CBI, Telangana Central Bureau of Investigation

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇచ్చిన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 30నే జీవో 51 ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టుకు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1946లోని సెక్షన్ 6 కింద జారీ చేసిన అన్ని మునుపటి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ ఆగస్టు 30న ప్రభుత్వ హోం (ప్రత్యేక) శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఏజీ కోర్టుకు తెలియజేశారు. గతంలో రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా సీబీఐకి అనుమతి ఇవ్వగా తాజాగా రద్దు చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏదైనా కేసులో దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eighteen =