రూ. 100 కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హీరోలుగా నిలబడ్డారు – సీఎం కేసీఆర్

CM KCR Praises The Four TRS MLAs Who Rejects Rs 100 Cr Offer in Public Meeting at Chandur Today, CM KCR Praises Four TRS MLAs, CM KCR Public Meeting, CM KCR Public Meeting at Chandur Today, Mango News,Mango News Telugu, Allegations on TRS MLAs Purchasing Issue,Telangana BJP Chief Bandi Sanjay,Allegations on TRS MLAs Purchasing, MAngo News, Mango News Telugu,TRS MLAs Purchasing Issue, TRS MLAs Purchasing Issue Amid Munugode By-poll, TRS MLAs Purchasing Issue, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna BJP Party,

నల్గొండ జిల్లాలోని ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనున్న క్రమంలో ప్రచారానికి సమయం మరో రెండు రోజులే మిగిలి ఉంది. ఈ రెండు రోజుల పాటు బహిరంగసభలు, సమావేశాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం నియోజకవర్గ పరిధిలోని చండూరు మండలం బంగారి గడ్డ వద్ద అధికార పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక తెలంగాణవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగా కాంతారావులు సీఎం కేసీఆర్ వెంట సభకు రావడం విశేషం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..

  • కేసీఆర్‌ను ప‌డ‌గొట్టి, తెలంగాణ‌ను క‌బ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
  • ఓటు అనేది మ‌న త‌ల రాత రాసుకునే గొప్ప ఆయుధం. ఒళ్లు మ‌రిచి ఓటేస్తే ఇల్లు కాలిపోత‌ది.
  • ఈ మునుగోడు ఉప ఎన్నిక అవ‌స‌రం లేకుండానే వ‌చ్చింది. అయినా ఇక్కడి ప్రజలు ఎన్నిక ఫ‌లితం ఎప్పుడో తేల్చేశారు.
  • ఢిల్లీలోని కొందరు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభపెట్టారు.
  • అయితే వారి ఆఫర్ ను ఎడమకాలి చెప్పుతో కొట్టినట్లు తిరస్కరించారు మన ఎమ్మెల్యేలు.
  • తద్వారా మన తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు.
  • వందల కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని నిలబెట్టారు. ఇలాంటివారే నేటి రాజకీయాలకు కావాలి.
  • దేశంలో ఏ ప్ర‌ధానమంత్రి కూడా చేయ‌ని విధంగా ప్రస్తుత ప్రధాని మోదీ చేనేత‌పై 5 శాతం జీఎస్టీ విధించి వారి బతుకులను ఆగం చేశాడు.
  • మునుగోడులో చేనేత కార్మికులు అలోచించి ఓటు వేయాలి. పోస్టుకార్డు ఉద్య‌మంపై నిర్ణ‌యం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు.
  • మన రాష్ట్రంలో త‌ప్ప దేశంలో ఎక్క‌డా కూడా 24 గంట‌ల పాటు విద్యుత్ ఇవ్వ‌డం లేదు.
  • విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట విద్యుత్ మీట‌ర్లు పెడుతామ‌ని చెబుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మీట‌ర్ల‌కు ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేదు.
  • మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి లేకుండా గ‌త 20 ఏళ్లలో ఏ స‌భ‌లో కూడా మాట్లాడ‌లేదు. ఆయన ఏం త‌ప్పు చేశాడని నిషేధం విధించారు?
  • మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య గురించి 20 ఏళ్ల క్రితం కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
  • టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే మిషన్ భగీరథ ద్వారా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాం.
  • అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నియోజకవరాగంలోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది.
  • కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడులో రోడ్లను అద్దాల్లా బాగు చేయించే బాధ్యత కూడా నాదే.
  • వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ వంటివి 15 రోజుల్లోనే ఏర్పాటు చేస్తాను.
  • అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ 82 రూపాయాలు ఉంది. నేపాల్‌, పాక్‌, బంగ్లాదేశ్‌ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా తయారవుతోంది పరిస్థితి.
  • రూ.400 ఉండే సిలిండర్‌ ధర రూ.1200 చేసింది ఎవరు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచెంది ఎవరు?
  • దేశంలో చైతన్యం రానంత వరకు ప్రజలు జీవితాలు మారవు. మాటలు చెప్పేదెవరో.. చేతలు చేస్తోందెవరో గుర్తించి ఓటేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nineteen =